Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో మాట్లాడుతున్న అమెరికా జాతీయుడు... వైరల్ అవుతున్న వీడియోలు!

  • అమెరికాలో ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తున్న ఐజాక్ రిచర్డ్స్
  • గతంలో ఓ ప్రాజక్టు కోసం తెలుగు గడ్డపై పనిచేసిన అనుభవం
  • కష్టపడి తెలుగు నేర్చుకున్న వైనం
మనం ఇంగ్లీషులో మాట్లాడడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కానీ, పాశ్చాత్యులు మన భాషలో మాట్లాడితే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇప్పుడు అమెరికాకు చెందిన ఐజాక్ రిచర్డ్స్ అనే యువకుడు తెలుగులో మాట్లాడుతూ తెలుగువాళ్లను విస్మయానికి గురిచేస్తున్నాడు. కొంచెం యాసగా ధ్వనిస్తున్నా, రిచర్డ్స్ తెలుగు పలుకులు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ యువకుడు యూఎస్ లో ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తున్నాడు.

గతంలో రెండేళ్లపాటు విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఓ ప్రాజక్టులో భాగంగా పనిచేశాడు. అప్పుడు కష్టపడి నేర్చుకున్న తెలుగును ఇటీవల తన ఐస్ క్రీమ్ పార్లర్ కు వచ్చిన కొందరు తెలుగువాళ్ల ముందు ప్రదర్శించాడు. దాంతో వాళ్లు షాక్ తినడమే కాదు, అతడి తెలుగు స్పీకింగ్ ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, ఆ వీడియోలో రిచర్డ్స్ ను న్యూజిలాండ్ దేశస్తుడిగా పేర్కొన్నారు. తాను న్యూజిలాండ్ వాడ్ని కాదని, తాను అమెరికా జాతీయుడ్నని రిచర్డ్స్ స్వయంగా మరో వీడియోతో తెరపైకి వచ్చాడు. ఇప్పుడీ వీడియో కూడా వైరల్ అవుతోంది.

USA
Andhra Pradesh

More Telugu News